ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష
నవతెలంగాణ – పాలకుర్తి
పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను యుక్త ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి, కొడకండ్ల దేవరుప్పుల మండలాల్లో అభివృద్ధి పనుల పురోగతిపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ఎన్ఆర్ఈజీఎస్ తోపాటు సి ఆర్ ఆర్, ఎమ్మార్ ఆర్ నిధులను మంజూరు చేశామని తెలిపారు.
ఎన్ఆర్ఈజీఎస్ లో బీటీ రోడ్లు, సి ఆర్ ఆర్, ఎమ్మార్ ఆర్ నిధులతో సిసి రోడ్లు, మెటల్ రోడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించామని తెలిపారు. త్వరితగతిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యాన్ని వీడి బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అభివృద్ధిలో పాలకుర్తి నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే విధంగా చర్యలు చేపట్టి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఈఈ. శ్రీనివాస్ రావు, డిఈ రామలింగ చారి, స్పెషల్ ఏఈ భూక్య శ్రీనివాస్ నాయక్, ఏఈలు రాహుల్, మహేష్, పాలకుర్తి, దేవరుప్పుల మండల కాంగ్రెస్ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, నల్ల శ్రీరామ్, దేవరుప్పుల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పులిగిల్ల వెంకన్న తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES