Sunday, October 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రణాళికతో అభివృద్ధి పనులు

ప్రణాళికతో అభివృద్ధి పనులు

- Advertisement -

ఏటూరునాగారం ప్రాంతాన్ని మున్సిపాల్టీ చేస్తాం : పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క

నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
ప్రతి గ్రామానికీ ఒక ప్రణాళిక ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పంచాయతీరాజ్‌, స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఏటూరునాగారం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, రానున్న రోజుల్లో మున్సిపాలిటీగా మారుస్తామని చెప్పారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణానికి శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసుకోవాలని సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కూరగాయల మార్కెట్‌ నిర్మాణం చేస్తున్నామని అన్నారు.

గతంలో ఏటూరునాగారం, ములుగు రెండు ప్రాంతాల మధ్య బస్సు డిపో విషయంలో సమస్య తలెత్తిందని, సంబంధిత అధికారులు, రవాణా శాఖ మంత్రితో చర్చించి ఏటూరునాగారం ప్రాంతంలో బస్‌ డిపో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏటూరునాగారం నుంచి గోదావరి నది వరకు సీసీ రోడ్డు మంజూరు చేశామన్నారు. రానున్న రోజులలో మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌ మాట్లాడుతూ.. వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణం చేపడుతున్నామని, రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో గ్రౌండ్‌, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి అభివృద్ధి పనులను చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ రవి చందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రేగ కళ్యాణి, పంచాయతీ రాజ్‌ ఈ అజయ్ కుమార్‌, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, చిటమట రఘు, వావిలాల ఎల్లయ్య, లాలయ్య, సులేమాన్‌, గౌస్‌, ఖలీల్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -