నవతెలంగాణ-పాలకుర్తి
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం మండల అధ్యక్షునిగా మండలంలోని విసునూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నక్నమోని దేవేందర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కందికట్ల వెంకటేశం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మండల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య ఆధ్వర్యంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు జి చంద్రబాను, ప్రధాన కార్యదర్శి రవికుమార్ల సమక్షంలో మండల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవేందర్, వెంకటేషములు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, ఉపాధ్యాయుల సమస్యల సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాయం శోభారాణి, శైలజ, రమేష్, అంజయ్య, నరేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం మండల అధ్యక్షునిగా దేవేందర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES