Saturday, January 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుదేవిశ్రీ ప్రసాద్‌ హీరోగా 'ఎల్లమ్మ'

దేవిశ్రీ ప్రసాద్‌ హీరోగా ‘ఎల్లమ్మ’

- Advertisement -

‘బలగం’ ఫేమ్‌ డైరెక్టర్‌ వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని నిర్మాత దిల్‌రాజు రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చార్ట్‌బస్టర్‌ ఆల్బమ్‌లతో దశాబ్దాలుగా సంగీత ప్రపంచాన్ని అలరించిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేయడం విశేషం. అంతేకాదు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. సంక్రాంతి శుభ సందర్భంగా విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌ సినిమా మిస్టికల్‌ వరల్డ్‌ను అద్బుతంగా పరిచయం చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -