- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: క్రిస్మస్ పండగ వేళ వరుస సెలవులు రావడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల వాహనాలతో పార్కింగ్ ప్రాంతాలు, ఘాట్ రోడ్డు, ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య రద్దీ తీవ్రమైంది. ప్రత్యేక క్యూలు, వీఐపీ దర్శన కౌంటర్లు, 24 గంటల అన్నదానం ఏర్పాట్లున్నాయని, ఆన్‌లైన్ దర్శన స్లాట్లు వేగంగా నిండిపోతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.
- Advertisement -



