Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సలాబాత్పూర్ ఆలయానికి పాదయాత్రగా వెళ్లిన ప్రభత్ బేరి భక్తులు 

సలాబాత్పూర్ ఆలయానికి పాదయాత్రగా వెళ్లిన ప్రభత్ బేరి భక్తులు 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం నుండి సలాబాత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రభాత్ ఫేరి భక్తులు శనివారం తెల్లవారుజామున పాదయాత్రగా వెళ్లారు.  ముందుగా రాష్ట్ర సరిహద్దుల్లో గల శివాలయానికి వెళ్లి కార్తీక దీపాలు వెలిగించి హరతీ చేపట్టారు. అనంతరం అంజనేయ స్వామి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం హరతీ మహోత్సవం చేపట్టారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ప్రభాత్ ఫేరి బృందం భజనలు చేస్తూ సలాబాత్పూర్ హనుమాన్ మందిరానికి వెళ్లడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తుల పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -