నవతెలంగాణ – అశ్వారావుపేట: ఎల్లలు లేనిది దైవభక్తి ఒక్కటే అని ఓ అపర భక్తుడు నిరూపించాడు. ఆంధ్రప్రదేశ్,ఏలూరు జిల్లా కుక్కునూరు కు చెందిన పుప్పాల సురేష్ – వరలక్ష్మి దంపతులు రూ. లక్షా 50 వేల విలువైన అర కేజీ వెండి పూల దండను తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండలం వినాయకపురం సమీపంలో కొలువై ఉన్న శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారికి చెందేలా గురువారం ఆలయ కమిటీ కమిటీ చైర్మన్ నరాల శ్రీనివాసరావు,ఉప సర్పంచ్ జగదీష్,బేతి రాజశేఖర్,అర్చకుల సమక్షంలో కానుకగా సమర్పించారు. అనంతరం ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జక్కుల అబ్బులు,గరిగిపాటి నాగు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ, కుమార్ అయ్య గారు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దంపతులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.గ్రామ దేవతకు వెండి ఆభరణాన్ని సమర్పించిన సురేష్ దంపతులను గ్రామస్థులు మరియు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.
ముత్యాలమ్మ దేవతకు వెండి ఆభరణాలు ఇచ్చిన భక్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



