Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వేల్పూర్ లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ కార్యక్రమం 

వేల్పూర్ లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ కార్యక్రమం 

- Advertisement -

నవతెలంగాణ – (వేల్పూర్)  ఆర్మూర్ 
మండల కేంద్రంలో గొర్రెలు మేకలకు నట్ట ల  నివారణ మందుల కార్యక్రమం బుధవారం నిర్వహించినారు. ఈ సందర్భంగా  మండల పశువైద్య అధికారి డాక్టర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ..గొర్రె మేకల పెంపకదారులు (యజమానులు) ఉద్దేశించి వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి నట్టల నివారణ మందులు తాగించుకోవాలని తెలియజేశారు. నట్టల నివారణ చేయకపోతే నట్టలు రక్తాన్ని పీలుస్తూ జీవాలకు రక్తహీనత కలిగి జీవాలు నిరసించి పోతాయని తెలిపారు. వీటి వలన జీవాలకు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అనేక రోగాలకు గురవుతాయని అన్నారు.

అంతర పరాన్న జీవుల విషయానికి వస్తే పొట్టలో జలకలు కార్జకు జలగలు రక్తపు జలగలు అనేవి ముఖ్యమైనవని అన్నారు. అంతర పరాన్న  జీవులు జీవాల శరీరంలో ముఖ్య భాగాల అవయవాలలో నివసిస్తాయని, అందువలన జీవాలలో ఎదుగుదల కుంటుపడుతుంది అధిక బరువుని కోల్పోతాయని తెలిపారు. అందువలన రైతు ఆర్థికంగా నష్టపోతాడని చెప్పారు. కావున తప్పనిసరిగా నట్టల మందులు వేయించుకోవాలని తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొండి  రాజ్ కుమార్, ఉప సర్పంచ్ మేదరి చిన్న బాలయ్య,  సాయి పేట గ్రామ ఉపసర్పంచ్ జాగర్ల నవీన్,  పశు వైద్య సిబ్బంది సురేష్ జేవివో గంగాధర్ లైవ్ స్టాక్ అసిస్టెంట్ దయానంద్ , జావిద్ గోపాలమిత్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -