ప్రధానం చేసిన తెలుగు సినిపరిశ్రమ విలక్షణ నటుడు డాక్టర్.బాలిరెడ్డి పృద్విరాజ్
నవతెలంగాణ – మిర్యాలగూడ
హైదరాబాద్ ఆదర్శనగర్ బిర్ల సైన్స్ అకాడమి లోని భాస్కర ఆడిటోరియంలో జరిగిన ధనుర్మాస సంగీత నృత్య మహోత్సవంలో భాగంగా తెలంగాణ విజయ మాధవి సేవా సాంస్కృతిక అకాడమి అధ్వర్యంలో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శన లో మిర్యాలగూడ టౌన్ కు చెందిన భూక్య రాంబాబు – అరుణ ల చిన్నారి అయిన భూక్య నీతు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. తెలుగు సినిపరిశ్రమ విలక్షణ నటుడు డాక్టర్.బాలిరెడ్డి పృద్విరాజ్ చేతుల మీదుగా‘’ధనుర్ ముఖి అవార్డ మేమెంటోను ను చిన్నారి నీతూ అందుకున్నారు. ఈ కార్యక్రమములో మిమిక్రి ఆర్టిస్ట్ రమేష్, తెలుగు చలనచిత్ర కోరియోగ్రాఫర్ నిక్షన్, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్ మెంట్ బోర్డు జాయింట్ డైరెక్టర్ శశి శ్రీ, హెల్త్ ఫిట్ నెస్ మోటివెటర్ అను ప్రసాద్ తదితరులు ఉన్నారు.
భూక్య నీతుకు ధనుర్ ముఖి అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



