అండాల్ అమ్మవారికి నవ కలశ పంచామృ తాభిషేకాలు..
శ్రీవారిని దర్శించుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు..
శ్రీనివాసుడి సేవలో రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి కుటుంబం..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఆదివారం రోజు అండాల అమ్మవారికి నవ కలశ పంచామృతాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి నిత్య కైంకర్యములలో భాగంగా నేటి ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు పలు కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణాచార్యులు తెలిపారు. నేటి ఉదయం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని గత నెల 30 నుండి జనవరి 8 వ తేదీ వరకు నిర్వహించే వైకుంఠ ఏకాదశి వేడుకలలో భాగంగా కుటుంబ సభ్యులతో స్వర్ణగీరీశున్నీ దర్శించుకున్నట్లు తెలిపారు.
ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి , పి.వి శ్రీనివాస రావు కుటుంబ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు విచ్చేసిన అతిథులకు వేద ఆశీర్వాసనం చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ వారికి స్వామివారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు.



