- Advertisement -
టోక్యో : టోక్యో డెఫ్‌లింపిక్స్‌లో తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ మరో పసిడి పతకం గురి పెట్టాడు. 10మీ ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ధనుశ్ శ్రీకాంత్.. మంగళవారం జరిగిన మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించాడు. 10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో ధనుశ్, మహిత్ జోడి 17-7తో దక్షిణ కొరియా షూటర్లపై గెలుపొందింది. మరో భారత జోడీ ముర్తాజా, కోమల్ మిలింద్‌లు 7-5తో ఉక్రెయిన్‌పై గెలుపొంది కాంస్య పతకం సాధించారు. బంగారు పతకం సాధించిన ధనుశ్ శ్రీకాంత్‌ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాట్జ్ చైర్మెన్ శివసేనా రెడ్డి అభినందించారు.
- Advertisement -



