Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధారా భాస్కర్ జనంపల్లి సోదరులపై ఆరోపణలు మానుకోవాలి

ధారా భాస్కర్ జనంపల్లి సోదరులపై ఆరోపణలు మానుకోవాలి

- Advertisement -

మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య 
నవతెలంగాణ – నవాబు పేట
ధారా భాస్కర్ జనంపల్లి సోదరులపై ఆరోపణలు మానుకోవాలి అని తమ పోకడ పార్టీ పరంగా తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉందని మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు జరిగిన సమస్యలను పరిష్కరించాలని నీకు తపన ఉంటే ఆ సమస్య పరిష్కారం కోసం సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసి పరిష్కారం దిశగా కృషి చేయాలి తప్ప పార్టీ నాయకుల మీదనే అనవసర ఆరోపణలు చేయడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉందని ఆదేశించారు.

ఉన్న విభేదాలను పక్కన పెట్టి మరిన్ని విభేదాలు సృష్టించే విధంగా నీ విధానం ఉందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు అని తెలిపారు. దుశ్యంత్ రెడ్డి విషయంలో తన సమస్య ఏమైనా ఉంటే పార్టీ సీనియర్ నాయకులతో కలిసి మాట్లాడి సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తాం అని తెలిపారు. రాష్ట్ర స్థాయి పదవిలో ఉండి మండలంలో కీలక నాయకులపై దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నవాబుపేట మండలానికి నాయకుడే కరువయ్యారనే తరుణంలో జనంపల్లి సోదరులు వచ్చి మండల నాయకత్వానికి వెన్నెముకగా ఉండి కార్యకర్తలకు ఆర్థిక రాజకీయ పరంగా అండగా నిలిచిన మానవతా వాదులు జనంపల్లి సోదరులు అని గుర్తు చేశారు.

గత స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో ఉన్న అభ్యర్థుల అందరికీ ఆర్థిక రాజకీయ పరంగా అండగా నిలిచిన గొప్ప మనసున్న నాయకులు ఎంఎల్ఏ అనిరుధ్ రెడ్డి ధుశ్యంత్ రెడ్డి అని తెలియజేశారు. కుల రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని గుర్తించుకోవాలి అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం వైస్ చైర్మన్ తులసి రాం నాయక్ జగన్మోహన్ రెడ్డి, వాసు యాదవ్ వెంకటేష్ గౌడ్ నవాజ్ రెడ్డి భూపాల్ రెడ్డి, రవిందర్ రెడ్డి రమేష్ గౌడ్ ఖాజా మైనోద్దీన్ రాజశేఖర్ నర్సింహులు బంక వెంకటయ్య హమీద్ మహెక్ యాదయ్య, చిర్ప సత్యం ఆనంద్ ఆశన్న తానెం సుధాకర్ సంతోష్ నాయక్ నరేష్ ఎండీ ఉమర్ సురేష్ గోపాల్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -