Friday, October 31, 2025
E-PAPER
Homeకరీంనగర్ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం ధర్మాజీపేట ఇందిరమ్మ ఇండ్లు

ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం ధర్మాజీపేట ఇందిరమ్మ ఇండ్లు

- Advertisement -

-లబ్ధిదారుల ఖాతాల్లో విడతల వారిగా రూ.5 లక్షలు జమ
-ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 
నవతెలంగాణ – రాయికల్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాయికల్ మండలంలోని ధర్మాజిపేట గ్రామంలో మొట్టమొదటగా ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లబ్ధిదారులు మ్యాకల సరస్వతి-రాజిరెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, చీరను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…“అర్హత గల ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని,ధర్మాజిపేటలో ప్రారంభమైన ఇళ్లు ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలు చేయడం ద్వారా పేద ప్రజల సొంతింటి కల సాకారం అవుతోందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

ధర్మాజిపేట గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి దాదాపు 40 ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, విడతల వారీగా రూ.5 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అని తెలిపారు. “గరిబీ హటావో,భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయం,కాలువల నిర్మాణం వంటి అనేక ప్రజాప్రయోజన కార్యక్రమాలు మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చేపట్టారని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకురాలు ఆమె అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోల శ్రీనివాస్,సురేందర్ నాయక్,అనుపురం శ్రీనివాస్,పాదం రాజు,మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -