Sunday, March 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రతి సోమవారం డైరెక్టర్‌ ఆఫీస్‌లో 'ధర్మవాణి'

ప్రతి సోమవారం డైరెక్టర్‌ ఆఫీస్‌లో ‘ధర్మవాణి’

- Advertisement -

– దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

దేవాదాయ, ధర్మాదాయ శాఖ కేంద్ర కార్యాలయంలో ప్రతి సోమవారం ‘ధర్మవాణి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆ శాఖ కమిషనర్‌ హనుమంతరావు వెల్లడించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉదయం 10 గంటల నుంచి డైరెక్టర్‌ కార్యాలయంలో తనను కలవాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, అర్చకులు, శాఖకు సంబంధం ఉన్నా ఇంకెవరైనా వచ్చి తమ సమస్యను చెప్పొచ్చు అని పేర్కొన్నారు. ధర్మబద్ధమైన సమస్యలను తక్షణమే లేదా గరిష్టంగా వారం రోజుల్లో పరిష్కరిస్తామని వివరించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను కూడా పరిశీలించి పరిష్కార మార్గం చూపిస్తామని తెలిపారు. దరఖాస్తు పరిష్కారమైన తర్వాత సంబంధిత వ్యక్తులకు కార్యాలయం నుంచి సమాచారం అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిష్కరించలేని సమస్యలకు కారణాలు చెబుతామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -