Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeసినిమాకుటుంబ అనుబంధాల నేపథ్యంలో 'ధర్మవరం'

కుటుంబ అనుబంధాల నేపథ్యంలో ‘ధర్మవరం’

- Advertisement -

రాజ్‌ వేంకటాచ్ఛ హీరోగా నటించడంతో పాటు కథను అందించి, దర్శకత్వం కూడా వహించిన చిత్రం ‘ధర్మవరం’. ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
కథానాయకుడిగా తన అద్భుతమైన నటనతో పాటు దర్శకుడిగా తన ప్రత్యేకమైన ముద్రను వేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. వినాయక చవితి పండగ నేపథ్యంలో ఈ చిత్ర పోస్టర్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘పోస్టర్‌ చాలా బాగుంది. కొత్త ప్రయత్నం కనబడుతోంది. రాజ్‌ వేంకటాచ్ఛ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమా నాకు ఎంతో ప్రాణమైన ప్రాజెక్ట్‌. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేలా ఉండేలా కష్టపడ్డాం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా పోస్టర్‌ విడుదల కావడం మాకు ఒక శుభసూచకం. ప్రేక్షకుల ఆశీర్వాదాలు మాకుంటే ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది’ అని హీరో, దర్శకుడు రాజ్‌ వేంకటాచ్ఛ తెలిపారు. అజరు, నవీన్‌ రెడ్డి, సంయోగీత, ఏశాన్‌ ఖాన్‌ కీలక పాత్రల్లో నటించారు. గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కతిక విలువలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుందనే నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేసింది. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad