నవతెలంగాణ – ఆర్మూర్
అధిక వర్షాలు వరదల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని సోమవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేసినారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ.. అధిక వర్షాలు వరదల వల్ల ఇటీవల నిజాంబాద్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటంతా నీటమనేది ఇసుక మేటర్ వేయడం జరిగింది రైతులు పెట్టుబడి పెట్టి నెల రోజుల్లో చేతికి వచ్చే సమయానికి పంట అంతా నష్టపోయి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు వరి, మొక్కజొన్న, సోయా, పత్తి, కూరగాయలు అధిక వర్షాల వల్ల పంటలన్నీ నీట మునిగి రైతులు నష్టపోవడం జరిగింది. కావున ప్రభుత్వం నష్టపరిహారం అన్ని రకాల పంటలకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
మాక్కలు కొనుగోలు చేయక వర్షానికి నల్లగా అవడం వల్ల ధర తక్కువ రేటు కు ప్రవేట్ వెక్తులకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వము కొనుగోలు చేయాలని అన్నారు. వర్షకాలం వరి పంట కోతకు వచ్చాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లను వేటదివెంట రైస్ మిల్లు కు తరలించి రైతులకు నష్టం రాకుండా చూడాలని అన్నారు. వర్షానికి కొట్టుకుపోయిన రోడ్లు డ్రైనేజీలు వెంటనే పరిష్కారం చేయాలని, వర్షానికి పురాతన ఇండ్లు కూలిపోయిన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం గా డిమాండ్ చేస్తున్నామని హెచ్చరించారు. లేనియెడల రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలని రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తొగటి భూమన్న, సిఐటియు మండల కన్వీనర్ కోతాడు ఎల్లయ్య, రైతులు శేపూర్ సాయన్న, ఆలకుంట సాయిలు, చిన్నయ్య, ఎల్లయ్య , గుండేటి శంకర్, ఓంకార్, గంగారం, విడగొట్టి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
పంటనష్ట బాధితులకు పరిహారం చెల్లించాలని ధర్నా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES