నవతెలంగాణ – భువనగిరి
42 శాతం బిసి రిజర్వేషన్ల చట్టబద్ధత కల్పించానలి డిమాండ్ చేస్తూ ఈ నెల 5న పార్లమెంట్ ముందు నిరసన, 6న జతర్‌మతర్‌వద్ద ధర్న, 7న అధికారులు కలిని నివేదిక అందజేత కార్యక్రమం టీపీసీసీ అధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రూ.43 కోట్లు కేటాయించారని, మొదటి దశగా రూ.10 కోట్లు మంజూరు చేశారని, లో వోల్టేజి నివారణకు అదనంగా 10 సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో గురుకుల పాఠశాలలు అవస్థలకు చిరునామాగా మారాయని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 40 శాతం పెంచిన మిస్ చార్జీలతో హాస్టల్, గురుకులాల విద్యార్థులు కడుపునిండా అన్నం తింటున్నారని, గురుకులాల నిర్వహణపై బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని విమర్శించారు. ఈ మేరకు నియోజకవర్గంలోని పోచంపల్లి, వలిగొండ, భువనగిరి గురుకులాలకు, భువనగిరిలో డిగ్రీ కళాశాల కోసం మరోక శాశ్వత భవనాల నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమోదం తెలిపారని, అవసరమైన స్థల సేకరణ ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. భువనగిరి నియోజకవర్గానికి నర్సింగ్‌కళాశాల, బీసీ డిగ్రీ కళాశాల మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతిపాదించిన మూడు రహదారుల విస్తరణ పనులు,రూ.13.60 కోట్లతో శంకుస్థాపన చేసిన పనులు త్వరలో ప్రారంభం కానున్నట్టు, నాలుగు జంక్షన్ల అభివద్ధి పనులు డిపిఆర్ దశలో ఉన్నట్టు తెలిపారు.
రూ.20 కోట్ల అమత్ పనులను,రూ.2.50 కోట్లతో డబ్బులు బెడ్ రూమ్ ఇళ్లలో చేపట్టిన మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రూ.200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనకు, రూ.8 కోట్ల వ్యయంతో పూర్తిచేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని వివరించి పనులపై సమీక్షించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవేజ్ చిస్టి, మునిసిపల్ మాజీ చైర్మన్లు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూర వెంకటేష్, నాయకులు పోత్నాక్ ప్రమోద్ కుమార్, ఈరపాక నరసింహ పాల్గొన్నారు.
చట్ట బద్దత కోసం ఢిల్లీలో ధర్నా: ఎమ్మెల్యే కుంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES