- Advertisement -
జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ మహిళా సబ్‌కోటా కోసం ఈ నెల 16న ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్టు బీజీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 17 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లు ఆమోదం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, దాని కంటే ముందు జాతీయస్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలని పలు రాజకీయ పార్టీలు కోతున్నాయని తెలిపారు. ఇదే అంశంపై హైదరాబాద్‌లో నేడు అమరవీరుల స్థూపం వద్ద నిరసన చేపడతామని పేర్కొన్నారు.
- Advertisement -



