Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కలెక్టరేట్ ముందు ధర్నా

అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కలెక్టరేట్ ముందు ధర్నా

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదగిరి భువనగిరి జిల్లా ఆలేరు మండలం ప్రముఖ శైవక్షేత్రం కొలనుపాక గ్రామమునకు దేశం నలుమూలల నుండి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ప్రముఖమైన జైన దేవాలయం కలదు మార్వాడీలు దేశం నలుమూలల నుండి అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు తెలంగాణ సాయుధ పోరాటాల గడ్డ అయిన కొలంపాకలో సర్వేనెంబర్ 8 నందు సుమారు 2 ఎకరాల 20 గుంటల భూమి కలదు ఇట్టి భూమి నందు కొలనుపాక లోని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ  కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమం సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ మాట్లాడుతూ.. సంవత్సరం నుండి భూ పోరాటాలు నిర్వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యేకు పాదయాత్ర తో వినతి పత్రాలను కూడా అందజేసినట్లు తెలిపారు. ఎమ్మార్వోకు  అధికారులందరినికి వినతి పత్రాలు అందజేయడం జరిగిందని,  ఇప్పటికే తన స్థలం పైన ఆ స్థలంలో అర్హులు అయిన పేదలందరూ గుడిసెలు నిర్మించుకొని ఉన్నారని, అర్హులైన పేదలను గుర్తించి ఇంటి స్థలాలు ఇవ్వాలని అదేవిధంగా సాంక్షన్ చేసి నిర్మించాలని ప్రభుత్వం పేదల పక్షాన నిర్లక్ష్యం విడనాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

లేనివీడల సిపిఐ పార్టీ పేదల పక్షాన ఉండి పెద్ద ఎత్తున ఆందోళ కార్యక్రమాలను చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, మండల నాయకులు పోతు ప్రవీణ్, బొజ్జ శంకర్, కందుల మధు, కొలనుపాక గ్రామ శాఖ కార్యదర్శి పొన్నబోయిన రవి,భూ పోరాట కమిటీ సభ్యులు మోతే భవాని, పార్వతి సంపతి, గడ్డం క్రాంతి,కావడి సంధ్య,కావడి మౌనిక,బిచ్చగారి యాదమ్మ, గంజి సుశీల, నర్ర సరిత, యాట ఉపేందర్, ఎస్.కె సన లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -