Wednesday, October 29, 2025
E-PAPER
Homeకరీంనగర్కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ లో ధర్నా

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ లో ధర్నా

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
పవర్ లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నవంబర్ 20న హైదరాబాదులోని చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ముశం రమేష్ అన్నారు. సిరిసిల్లలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలుపరచాలని, ప్రభుత్వ చీరలకు యారన్ సబ్సిడీ అమలు చేయాలని, పవర్లూమ్ కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పవర్లూమ్,విద్యుత్ సమస్య పరిష్కరించి బ్యాక్ బిల్లింగ్ వెంటనే విడుదల చేయాలని, ఇతర రాష్ట్రాల కార్మికులకు రావలసిన  సబ్సిడీ అందించాలని తదితర డిమాండ్లతో నవంబర్ 20న హైదరాబాద్ లో  చేనేత  జౌళి శాఖ కార్యాలయం ముందు జరిగే ధర్నాను కార్మికులు విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమానికి  చేనేత పవర్లూమ్ రాష్ట్ర అధ్యక్షులు చెరిపెల్లి  సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ పాల్గొననున్నారు. ప్రభుత్వం 20వ తేదీ లోపు సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వర్కర్ టు ఓనర్ పథకానికి  షెడ్లను ఇతర కార్యక్రమాలకు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని పవర్లూమ్ కార్మికులకు గుర్తింపు కార్డు లేకపోవడం వలన 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు పెన్షన్ రాకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు.  త్రీప్టు పథకం అమలు చేయడంలో ఆలస్యం చేయడం జరుగుతుందనీ, సమస్యల పరిష్కారం కోసం జరిగే ధర్నాను కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోడం రమణ, పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్, జిల్లా నాయకులు బేజిగం సురేష్ ,స్వర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -