నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మున్సిపల్ పరిధిలోని బొమ్మయిపల్లి పల్లి 11 వార్డ్ లో రైల్వే స్టేషన్ దగ్గర ప్లాట్ కు సంబంధించి శనివారం ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1997 నుంచి 2023 వరకు రెండు దఫాలుగా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారని అన్నారు. ఈ విషయంపై అధికారులకు కలెక్టర్కు, ఎమ్మెల్యేకు ఇప్పటికీ నాలుగైదు సార్లు వినతి పత్రాలను అందజేశామని అన్నారు. అయినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో శనివారం ధర్నా నిర్వహించి, నిరసన చేశామని అన్నారు.
అదేవిధంగా ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. వారం లోపట వాటి ప్లాట్లకు పొజిషన్ ఇవ్వకపోతే రిలే నిరాహార దీక్ష చేస్తామని డిమాండ్ చేశారు. దీనిపై ఎమ్మార్వో సందిస్తూ.. వారం రోజులు లోపట పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. లేనిఎడల కచ్చితంగా ప్లాట్ల లబ్ధిదారుల అందరం కలిసి నిరాహార దీక్షకు పూనుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోప్లాట్ల అసోసియేషన్ అధ్యక్షుడు చింతల పెంటయ్య, పార్వతి బాలకృష్ణ, దాసరి లక్ష్మయ్య, పార్వతి దశరథ, ఎదునూరి శంకర్, పాముల లక్ష్మి, గుండబోయిన నర్సాలు, కురంపోషాలు, బండి మల్లేశం, కడారి ప్రవీణ్ యాదవ్, చింతల కృష్ణయ్య, దాసరి మహేందర్, మొగిలి నరసింహారెడ్డి, అఖిలపక్ష నాయకులు ఏశాల అశోక్, మాయ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



