- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలం కేంద్రంలోని దేవాలయానికి సంబంధించిన ఆవులను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. బుధవారం గ్రామస్తులు పెద్ద ఏడ్గి వెళ్లే రోడ్డులో దుండగులను వెంటనే పట్టుకోవాలని ధర్నా చేశారు. జుక్కల్, మహ్మదాబాద్, కేమ్రాజ్ కల్లాలి గ్రామాలకు చెందిన ఆవులతో పాటు బిచ్కుంద, పిట్లం మండలంలో కూడా ఆవులను అపరించకపోయారని తెలిపారు. ఈ సందర్భంగా వెంటనే దుండగులను పట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామస్థులు జుక్కల్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
- Advertisement -



