Friday, July 11, 2025
E-PAPER
Homeజిల్లాలుఎంఈఓను సస్పెండ్ చేయాలని ధర్నా.. 

ఎంఈఓను సస్పెండ్ చేయాలని ధర్నా.. 

- Advertisement -

ఖాళీ కుర్చీకి వినతి: ఎస్ఎఫ్ఐ 
నవతెలంగాణ – పరకాల 
: పరకాల ఎంఈఓ రమాదేవిని సస్పెండ్ చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గురువారం జరిగిన ధర్నా కార్యక్రమాన్నుద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించడానికి వెళ్లిన ఎస్ఎఫ్ఐ నాయకులకు ఖాళీ కుర్చీ దర్శనం ఇచ్చిందన్నారు. కానీ అక్కడ చూడ్డానికి మాత్రం ఎంఈఓ విధుల్లోనే ఉన్నట్లుగా టేబుల్ పై టిఫిన్ బాక్సు, వాటర్ బాటిల్, కుర్చీలో హ్యాండ్ బ్యాగ్ ఉండటం గమనార్హం.

అన్ని అక్కడే ఉన్నాయని భావించిన ఎస్ఎఫ్ఐ నాయకులు ఎంఈఓ అందుబాటులోనే ఉండొచ్చు అని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే వేచి చూడడం జరిగింది.ఎంతకీ ఎంఈఓ రాకపోగా ఫోన్లో సంప్రదించగా వస్తానని చెప్పిన ఎంఈఓ వచ్చిన క్షణాల్లోనే వెనుతిరిగి వెళ్లడం, ఎస్ఎఫ్ఐ నాయకులను కంగుతినిపించింది. చేసేది ఏమీ లేక ఎస్ఎఫ్ఐ నాయకులు తాము చేయాలనుకున్న రిఫ్రెంటేషన్ను ఖిళీ కుర్చీకి సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఎంఈఓ కార్యాలయానికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక స్వదూపాయల కల్పన, పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనంలో జరుగుతున్న అక్రమాల విషయమై రిప్రజెంటేషన్ చేయడానికి వెళ్ళగా అక్కడ ఖాళీ కురిసి దర్శనమిచ్చిందన్నారు.

గతం నుంచి సైతం ఎంఈఓ విధులకు డుమ్మా కొడుతున్నట్లు తమ దృష్టికి రావడం జరిగిందన్నారు. పరకాల ప్రాంతంలో ఎనమిదేండ్లుగా పాతుకుపోయిన ఎంఈఓ రమాదేవి ప్రైవేటు విద్యాసంస్థలతో లాభీయింగుకు పాల్పడుతూ ప్రయివేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ,బుక్స్, పుస్తకాలు నోట్ బుక్స్, టై, బెల్టులను సైతం విక్రయిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు అంటూ ఆరోపించారు.

అంతేకాకుండా ఎంఈఓ అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి 8 సంవత్సరాలుగా పరకాల మండలంలో పాతుకుపోయిన ఎంఈఓ ను తొలగించి మండలానికి కొత్త ఎంఈఓ ను కేటాయించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -