- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
సిపిఎస్ రద్దు చేయాలని సెప్టెంబర్ 1న హైదరాబాదులోని ఇందిరాపార్క్ దగ్గర ఉద్యోగ ఉపాధ్యాయుల తలపెట్టిన ధర్నా వాల్పోస్టర్ను మంగళవారం మండల కేంద్రంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ…. 2004 సెప్టెంబర్ 1 నుండి నియామకమైన ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు పాత పింఛన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, ఆనంద్, సురేష్, బాబు, గోపాలరావు, సెట్యా నాయక్, బాలరాజు, బాల్ కిషన్, లతా, పద్మావతి, నాగరాణి, లావణ్య రాణి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -