- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్ అవుతాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. గుజరాత్‌తో మ్యాచ్ తర్వాత ప్రకటిస్తాడు అని ఆ వార్తల సారాంశం. మ్యాచ్ అనంతరం ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించాడు. ఐపీఎల్ రిటైర్ అవ్వాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎప్పటిలానే చెప్పాడు. చాలా రోజులుగా ఇంటికి దూరంగా ఉంటున్నానని, ఇప్పుడు రాంచీ వెళ్లి కుటుంబంతో సమయం గడుపుతా అని చెప్పాడు. ఓ నాలుగైదు నెలల తర్వాత ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటా అని చెప్పాడు.
- Advertisement -