Saturday, September 27, 2025
E-PAPER
Homeజిల్లాలుఅత్యవసర సమయంలో 100కు డయల్ చేయండి..

అత్యవసర సమయంలో 100కు డయల్ చేయండి..

- Advertisement -

మహిళా పోలీస్ స్టేషన్ సీఐ అర్జునయ్య…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

మహిళలు అత్యవసర సమయంలో 100 నెంబర్ కు డయల్ చేయాలని ఉమెన్ పి ఎస్  ఇన్స్పెక్టర్  అర్జునయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మహిళలకు భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో  అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్ ప్రదేశాలలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అపరిచిత వ్యక్తుల నుంచి తిరుబండారాలు ఏది ఇచ్చినా కూడా తీసుకోకూడదని, ఎవరైనా చెడుగా ప్రవర్తించిన 100కు డయల్ చేయాలని సూచించారు. విద్యార్థినీలను ఎవరైనా ఆకతాయిలాలు వేధిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని వారి పేర్లు గోప్యంగా  ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కృష్ణ, ఉమెన్ ఎస్సై అండాలు, ఏఎస్ఐ రాములు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ చారి, కానిస్టేబుల్ హరీష్, ఉమెన్ కానిస్టేబుల్స్ తిరుపతమ్మ, రజితలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -