- Advertisement -
నవతెలంగాణ – పరకాల : పరకాల పరిధిలో ఆర్టీసీ సేవల మెరుగు కోసం రేపు డయాల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పరకాల ఆర్టీసీ డీఎం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఆర్టీసీ సేవల మెరుగు కోసం సరైన సలహాలు సూచనలు 9666919190 సెల్ నెంబర్ కు ఈరోజు సాయంత్రం 3గంటల నుండి 4 గంటల వరకు ఫోన్ చేసి సమాచారం అందించాలని పరకాల డిపో మేనేజర్ ఏం రవి చందర్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. పరకాల ఆర్టీసీ డిపో పరిధిలోని ఆయా మండలాలకు సంబంధించిన ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ అభివృద్ధికి సరైన సూచనలు సలహాలు అందించాలని డీఎం కోరారు.
- Advertisement -