– నివేదిక సమర్పించండి : నల్లగొండ కలెక్టర్‌కు హెచ్‌ఆర్‌సీ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆస్తులు పంచుకుని అమ్మను గెంటేశారని పత్రికల్లో వచ్చిన వార్తలపై వాస్తవ స్థితిగతులతో ఏప్రిల్ 6లోగా నివేదిక సమర్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రామలింగల గూడెం గ్రామానికి చెందిన వృద్ధురాలు ముట్టెని రత్నమ్మ పట్ల నిర్లక్ష్యం వహించి ఆమె కుమారులు ఇంటి నుంచి గెంటేసినట్టు ఆ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. ఆమె పరిస్థితిని వెలుగులోకి తెస్తూ వచ్చిన పత్రిక కథనాన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఆ ఆరోపణలు నిజమైతే అది వృద్ధుల హక్కుల ఉల్లంఘనే అని కమిషన్ వ్యాఖ్యానించింది.
అమ్మను గెంటేశారా?….
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



