- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రెండు వేల మంది వరకు భక్తులు వస్తుంటారని, ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదని అన్నారు. భక్తులకు ప్రసాద వితరణ చేసి పంపిస్తానని, ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. ఇంత మంది వస్తారని తెలియక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదని తెలిపారు. కాగా ఆలయంలోనే హరిముకుంద్ పండాతో కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు.
- Advertisement -


