నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ప్రక్కన ఆగి ఉన్న లారీలలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డీజిల్ చోరీ చేశారు. సోమవారం అర్ధరాత్రి ఘటన చోటు చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. మూడు లారీల డ్రైవర్లు గోపి, సాగర్, రమేష్ లు సూర్యాపేట నుంచి వడ్లు లోడుతో రాయచూర్ వెళ్తుండగా మండలంలోని ప్రధాన రహదారి పక్కన వాహనాలను ఆపి నిద్రించినట్లు తెలిపారు. మంగళవారం వేకువ జామున లేచి లారీ టైర్లను పరిశీలించే క్రమంలో డిజిల్ ట్యాంక్ తాళం తెరిచి ఉండడాన్ని గమనించి, ట్యాంక్ ను పరిశీలించగా డీజిల్ చోరికి గురైందని తెలుసుకున్నారు. సుమారుగా మూడు లారీల లో 1000 లీటర్ల డీజిల్ చోరీకి గురైనట్లు వారు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవాలి.
ఆగి ఉన్న లారీలలో డీజిల్ చోరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES