Thursday, June 5, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్హరీష్‌రావు, కేటీఆర్ మధ్య విభేదాలు..! బీఆర్ఎస్ లో బయటపడ్డ లుకలుకలు

హరీష్‌రావు, కేటీఆర్ మధ్య విభేదాలు..! బీఆర్ఎస్ లో బయటపడ్డ లుకలుకలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలున్నాయా..? కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు సైలెంట్‌గా కొనసాగుతోందా..? బలాబలాలు నిరూపించుకునేందుకు బర్త్ డే ఫ్లెక్సీలనే అడ్డుపెట్టుకున్నారా..? మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బర్త్ డేని పురస్కరించుకొని తెలంగాణ భవన్ దగ్గర ఏర్పాటు చేసిన ఫెక్సీలను తొలగించడం వెనుక అధికార పార్టీ దురుద్దేశమే కారణమా లేక వర్కింగ్ ప్రెసిడెంట్ అనుచరవర్గం అత్యుత్సాహం ఉందా అనేది అర్దం కావడం లేదు. హరీష్ రావు బర్త్ డే సందర్భంగా పార్టీ శ్రేణులు పార్టీ ఆఫీస్ ముందు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. తెలంగాణ భవన్ లోపల, వెలుపల కట్టిన ఫ్లెక్సీలను తొలగించిన అధికారులు కేవలం కేటీఆర్ ఫోటోతో ఉన్న కటౌట్ తొలగించకపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.
బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు ఉన్నట్లుగానే కనిపిస్తోంది. నిన్నటి వరకు పార్టీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లెటర్ ఇష్యూ పెద్ద దుమారం రేపింది. ఇది చల్లారక ముందే మరో టాపిక్ తెరపైకి వచ్చింది. సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు బర్త్ డే కావడంతో మంగళవారం పార్టీ శ్రేణులు విషెస్ చెబుతూ పార్టీ ఆఫీస్ దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -