Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుస్వాతంత్ర ఫలాలు అందరికీ అందినప్పుడే తారతమ్యాలు తగ్గుతాయి: సీపీఐ(ఎం)

స్వాతంత్ర ఫలాలు అందరికీ అందినప్పుడే తారతమ్యాలు తగ్గుతాయి: సీపీఐ(ఎం)

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందినప్పుడే తారతమ్యాలు తగ్గుతాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు శుక్రవారం  79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఖిల్లా ఫిల్టర్ వద్ద ఆటో వర్కర్స్ యూనియన్ జాతీయ జెండావిష్కరణలో జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు పాల్గొని జెండా ఎగరవేసిన తర్వాత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే 79 సంవత్సరాలు అవుతున్న దేశంలో పేదరికం తగ్గలేదని అనేకమంది నేటికీ అర్ధాకలితో జీవిస్తున్నారని, ప్రజలందరినీ కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని అన్నారు.

ఈ విధానాల వల్ల కొద్దిమంది కార్పొరేట్ కంపెనీలకు మాత్రం అనేక సౌకర్యాలను కల్పిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కట్టబెట్టడం మరొకవైపు పేదరిక నిర్మూలనకు కృషిచేకపోవటంతో వ్యత్యాసాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ వ్యత్యాసాలు తగ్గాలంటే విద్యా ,వైద్యం ,ఉపాధి అందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. అందుకు ఈ ప్రభుత్వ విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని దానికి ప్రజలంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు. మరియు రఫిక్, షేక్ ముజీబ్, సయ్యద్ ఇర్ఫాన్, అనీస్, ఇమ్రాన్ ఖాన్, పండరి, విజయ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad