No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeసినిమావిభిన్న ప్రేమకథా చిత్రం

విభిన్న ప్రేమకథా చిత్రం

- Advertisement -

సుధీస్‌, అంకిత హీరో, హీరోయిన్లుగా అరవింద్‌ జాషువా దర్శకత్వంలో రూపొండుతున్న ఇంటెన్స్‌ ఎమోషనల్‌ లవ్‌ స్టొరీ ‘పేషన్‌’. రేడంట్‌ క్రియేషన్‌ బ్యానర్‌ పై నరసింహా యేలే, ఉమేష్‌ చిక్కు, రాజీవ్‌ సింగ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల లాంచ్‌ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’అరవింద్‌ జాషువా ‘ఆనంద్‌’ సినిమా నుంచి నాకు పరిచయం. అప్పటిలోనే తనలో స్టోరీ టెల్లింగ్‌ రైటింగ్‌ క్రియేటర్‌ ఉన్నాడని అనిపించింది. తను ‘పేషన్‌’ అని ఒక నవల రాశారు. అది నేను చదివాను. చాలా బాగుంది. తను వచ్చిన ఫ్యాషన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ గురించి ఇందులో రాశారు. అందుకే చాలా అథెంటిక్‌గా ఉంది. ఇది ఫస్ట్‌ ఆఫ్‌ ఇట్స్‌ కైండ్‌ ఫిల్మ్‌. ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అరవింద్‌కి మంచి మ్యూజిక్‌ టేస్ట్‌ ఉంది. స్క్రిప్ట్‌ చాలా బాగుంది. నిర్మాతలు అందరూ కొత్తవాళ్లు. వీళ్లంతా చాలా ప్యాషన్‌తో సినిమా తీస్తున్నారు’ అని అన్నారు. ‘ఈ సినిమా కాన్వాస్‌ చాలా పెద్దది. చాలా పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు చదివే ఒక ఫ్యాషన్‌ కాలేజీలో నాలాంటి ఒక సామాన్యుడు చదివితే ఎలా ఉంటుందో ఒరిజినల్‌గా నేను ఫీల్‌ అయి రాసిన కథ ఇది. టైటిల్‌ సూచించినట్లుగా ఇది ఇంటెన్స్‌ ఎమోషన్స్‌తో కూడిన లవ్‌ స్టోరీ. ఈ జనరేషన్‌కి కనెక్ట్‌ అయ్యే కథ ఇది’ అని డైరెక్టర్‌ అరవింద్‌ జాషువా చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad