మంచిర్యాల కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు హస్తం కైవసం
ఏడు మున్సిపాల్టీల్లో మిశ్రమ ఫలితాలు
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు విభిన్న తీర్పు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మిగతా ఏడు మున్సిపాలిటీల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏ పార్టీకీ అధిక స్థానాలు లభించలేదు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో సైతం బీజేపీ సత్తా చాటుకోలేకపోయింది. మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు లక్షెట్టిపేట మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం కాగా క్యాత్‌పల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ అత్యధిక స్తానాలు స్థానాలు కైవసం చేసుకుంది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్య హంగ్ ఏర్పడింది.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ పరిధిలోని 268 వార్డులు, 60 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా నిర్మల్, చెన్నూర్, లక్షెట్టిపేట, మంచిర్యాల కార్పొరేషన్ హస్తగతం చేసుకుంది. ఇతర ఏడు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రజలు విభిన్న తీర్పును ఇచ్చారు. ఏ పార్టీకి అత్యధిక స్థానాలు రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మంచిర్యాల కార్పొరేషన్‌లో 60 డివిజన్‌లు ఉండగా 44 డివిజన్లలో కాంగ్రెస్ గెలుపొందగా 8 బీఆర్‌ఎస్ 5 బీజేపీ, 3 ఇతరులు గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ మొదటి ఆరిగా మంచిర్యాల కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది.
క్యాతన్‌పల్లిలో బీఆర్‌ఎస్, సీపీఐ హవా
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా 7 కాంగ్రెస్, 10 బీఆర్‌ఎస్ గెలుపొందింది. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో 4 వార్డులు సీపీఐ గెలుపొందడంతో బీఆర్‌ఎస్, సీపీఐ కలిసి మున్సిపల్‌పై జెండా ఎగుర వేయనున్నాయి. నిర్మల్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యే ఉన్న ముధోల్ నియోజకవర్గంలోని భైంసా మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను కాంగ్రెస్ ఒకే స్థానానికి పరిమితం కాగా బీజేపీ 6 స్థానాలు కైవసం చేసుకోగా, బీఆర్‌ఎస్ కనుమరుగైంది. అత్యధికంగా ఎంఐఎం 12 స్థానాలు గెలుపొందగా 7 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
ఆదిలాబాద్‌లో విభిన్న తీర్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



