‘బలగం’ తర్వాత కావ్య కళ్యాణ్‌రామ్, ‘కొత్తపోరడు’ తర్వాత అన్వేష్ మైఖేల్ జంటగా రాబోతున్న చిత్రం ‘వాట్స్ అప్ నరేష్’. సివివి సినిమా బ్యానర్ మీద భాగ్యలక్ష్మీ చింత నిర్మించిన ఈ చిత్రానికి సివి విశాల్ దర్శకత్వం వహించారు. యూత్‌ఫుల్, లవ్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నరేష్ పాత్రలో అన్వేష్ మైఖేల్ చిల్ గాయ్ లా కనిపిస్తున్నాడు. ఎనిమిది కోట్లు కట్నం ఇస్తే ఎన్ని కాలాలు అయినా వెయిట్ చేస్తా అనే డైలాగ్‌తో అతని పాత్రని పరిచయం చేశారు.
ఇక సాఫ్ట్ వేర్ లైఫ్, ప్రేమ, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల అంశాల్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ఇక చివర్లో సింపుల్‌గా హాయ్ అంటూ హీరో, హీరోయిన్ల పాత్రల పరిచయం కూడా కొత్తగా, ఫ్రెష్‌గా అనిపిస్తోంది. ఇక గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన ‘లోకం తీరింతే.. నువ్వే మారాలంతే.. లొల్లె ఒద్దంటే.. తెలివిని కప్పెట్టంతే’ అనే లిరిక్స్ సినిమా కథని, హీరో పాత్రను తెలియజేసేలా ఉన్నాయి. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. విప్లవ్ నైషదం ఎడిటర్‌గా, వేదరామన్ శంకరన్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రేమికుల రోజున ఈ మూవీకి సంబంధించిన రెండో గ్లింప్స్‌ని రిలీజ్ చేయబోతున్నారు.
భిన్నంగా ‘వాట్స్ అప్ నరేష్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



