Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ..

కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ..

- Advertisement -

మండల అగ్రికల్చర్ అధికారి నవ్య 
నవతెలంగాణ – నిజాంసాగర్/మహమ్మద్ నగర్ 
: కల్తీ విత్తనాలను ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మహమ్మద్ నగర్ మండల వ్యవసాయ అధికారి నవ్య అన్నారు. శనివారం మండలంలోని మహమ్మద్ నగర్, గాలిపూర్, కోమలంచ గ్రామాలలోని విత్తనాల దుకాణాలను ఆమె తనఖి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విత్తన నిలువలు, స్టాక్ రిజిస్టర్లు, మూల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించడం జరిగిందని ఆమె అన్నారు. అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలను సరైన ధరలకు మాత్రమే విక్రయించాలని ఆమె డీలర్లకు ఆదేశించారు. ఎక్కువ ధరకు విత్తనాలను నమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -