Saturday, January 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోటీ పరీక్షలకు డిజిటల్‌ కంటెంట్‌

పోటీ పరీక్షలకు డిజిటల్‌ కంటెంట్‌

- Advertisement -

– మంత్రి శ్రీధర్‌ బాబు
– ఎడ్‌ సెట్‌ ప్రసారాల షెడ్యూల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పోటీ పరీక్షల కోసం టీ శాట్‌ డిజిటల్‌ కంటెంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు యువతకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో టిశాట్‌ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌ రెడ్డితో కలిసి మంత్రి టీశాట్‌ ఎడ్‌సెట్‌ ప్రసారాల షెడ్యూల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈ ప్రసారాలతో గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. మే నెలలో జరిగే ఎడ్‌సెట్‌ పరీక్ష కోసం అభ్యర్థులను సిద్ధం చేసేందుకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు రోజుకు 4 గంటలపాటు 392 ఎపిసోడ్స్‌ ప్రసారం చేస్తున్నట్టు చెప్పారు. బయాలజీ, పిజికల్‌ సైన్స్‌, మాథమేటిక్స్‌, సోషల్‌ స్టడీస్‌, ఇంగ్లీష్‌, తెలుగు సబ్జెక్టులతో 98 రోజుల పాటు టి-శాట్‌ విద్య, నిపుణ ఛానళ్లతో పాటు టీశాట్‌ యాప్‌, యూట్యూబ్‌లో ప్రసారాలు కొనసాగనున్నట్టు వెల్లడించారు. పోటీ పరీక్షలకు డిజిటల్‌ కంటెంట్‌ అందించేందుకు కృషి చేస్తున్న సీఈవో వేణుగోపాల్‌ రెడ్డిని మంత్రి శ్రీధర్‌ బాబు అభినందించారు.ఈ కార్యక్రమంలో టి-శాట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం.డి.సాధిక్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -