Monday, March 2, 2026
E-PAPER
Homeదర్వాజడిజిటల్‌ కాలం

డిజిటల్‌ కాలం

- Advertisement -

డిజిటల్‌ కాలం ట్రెండ్స్‌ మారుతాయి
అణచివేత అప్డేట్‌ అవుతూంటుంది
వైరల్‌ ఒక వైరస్‌ వ్యాపిస్తూ వ్యసనమవుతుంది
లైఫ్‌తో కాదు, లైక్స్‌తో పోరాటం!!
బతుకొక ప్రెజెంటేషన్‌, స్లైడ్స్‌లో సమానత్వం
బానిసత్వం కో – ఆప్షన్‌, కార్పొరేట్‌ సమాజం
కాంట్రాక్ట్‌ ఉద్యోగం, గిగ్‌ ఎకానమీ
పేరెమో ఫ్రీలాన్సర్‌, నిజం ఫ్రీ-లేబర్‌
రైతు పండిస్తాడు, మార్కెట్‌ నిర్ణయిస్తుంది
కార్మికుడు నిర్మిస్తాడు, క్యాపిటల్‌ సర్కార్‌ నిర్ణయిస్తుంది
దీని పేరే యాపరం, ప్రైవేట్‌ లాభం కోసం
ప్రజలకు మాత్రం బాధలు ఫ్రీ, డెమోక్రటిక్‌ దేశం
రాజ్యాంగంలో యూనిటీ, రాజ్యంలో ఉన్మాదం
మార్కెట్లో కొత్త యాప్‌ ఒకటి వచ్చింది
‘భజన బ్యాచ్‌’ దాని పేరు
లాగిన్‌, లాగౌట్‌, జై కొట్టు అంతే
సర్వర్లు కోల్పోయిన మానవత్వం
కామెంట్‌ బాక్స్‌ అయితే రేప్‌ ఫ్యాక్టరీ
రిపోర్ట్‌ చేస్తే బూతులు మల్టిప్లై
ఆధార్‌ కార్డు, వోటర్‌ ఐడీ
బయోమెట్రిక్‌ ఐరిస్‌
నీ ఫ్రీడమ్‌ డేటా బ్యాంకులో లాక్‌ అయిపోయింది
అడ్వర్టైజ్‌మెంట్‌ల మధ్య పేదల ఆకలి చావులు
ఆటో-ప్లే అవుతున్నాయి ఉచితలాతో ప్రభుత్వాలు
విద్య, వైద్యం మాత్రం ఉండదు
అందంగా మేనిఫెస్టోలు
”పాలసీలు కాదు, ప్రజలే మా ప్రైయారిటీ”
మెరుగులద్దిన టాగ్‌ లైన్‌!!
స్టేటస్లో న్యాయం, స్ట్రీట్‌లో నిర్లక్ష్యం
మేము షేర్‌ చేయం, మేము షేక్‌ చేస్తాం!”
ఫేక్‌ యాక్టివిజం మీద దెబ్బ
ట్రోల్స్‌ చేస్తే ట్రెండింగ్‌, ప్రశ్నిస్తే దేశద్రోహి
మత్తు అల్గారిథమ్‌ ఇస్తుంది
హేట్‌ స్పీడ్‌ పెంచుతుంది
చట్టం న్యాయం సైలెంట్‌ మోడ్‌
గుండె చప్పుడు ఇప్పుడు
పర్మిషన్‌ కోసం వెయిటింగ్‌!!
డిజిటల్‌ యుగం వచ్చింది కానీ,
దౌర్జన్యం ఇంకా డిలీట్‌ కాలేదు.
వైరల్‌ పోస్టులు చాలవు, లైవ్‌ రెసిస్టెన్స్‌ కావాలి
ఇప్పటికైనా లాగౌట్‌ అవుదాం
మనస్సాక్షిలోకి లాగిన్‌ అవుదాం!!

వేణు మూల, 8106226506

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -