Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలకు డిజిటల్ టీవీ విరాళం   

పాఠశాలకు డిజిటల్ టీవీ విరాళం   

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ ప్రైమారీ పాఠశాలకు డిజిటల్ తరగతుల నిర్వహణ కోసం53 ఇంచెస్ టీవీ ని గ్రామానికి చెందిన ప్రతిభ కేబుల్ యజమాని గురుడు శ్రీకంఠంకు మంగళవారం అందజేశారు. విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలకు టీవీని అందజేసిన శ్రీకంఠంకు పాఠశాల తరఫున సర్పంచ్ బైకాన్ జమున మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిలివేరి భూమేశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాకిషన్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మెన్ గంగామణి, వార్డు సభ్యులు అంకడి శేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -