Tuesday, July 1, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నువ్వు ఆ మార్కును సాధించలేకపోయావు..కుండ బద్దలు కొట్టిన దిల్‌రాజు

నువ్వు ఆ మార్కును సాధించలేకపోయావు..కుండ బద్దలు కొట్టిన దిల్‌రాజు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సినిమాలు, ఇతర అంశాలపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే వ్యక్తుల్లో నిర్మాత దిల్‌రాజు ఒకరు. అందుకే ఆయనకు సక్సెస్‌ రేటు ఎక్కువ. తాజాగా హీరో నితిన్‌ విషయంలోనూ తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పారు. ఇండస్ట్రీలో హీరో నితిన్‌ కన్నా తాను ఏడాది జూనియర్‌నని అంటూనే, తాను అనుకున్న స్థాయికి నితిన్‌ రాలేకపోయాడని అభిప్రాయపడ్డారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు నిర్మించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. నితిన్‌ కథానాయకుడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నితిన్‌, దిల్‌రాజుల మధ్య ఆసక్తికర ఇంటర్వ్యూ జరిగింది. ‘దిల్‌’తో నిర్మాత అయిన రాజు ఆ తర్వాత ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఈ సందర్భంగా నితిన్‌ అడిగిన ప్రశ్నకు ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానం ఇచ్చారు.

‘‘దిల్‌’కీ ‘తమ్ముడి’కీ మధ్యలో నితిన్‌లో చూసిన మార్పులేంటి? ప్లస్‌, మైనస్‌లు రెండూ చెప్పండి’’ అని నితిన్‌ అడగ్గా, ‘‘ఒక నటుడిగా 22 ఏళ్లు సుదీర్ఘ జర్నీ చేశావ్‌. నిజం చెప్పాలంటే నాకంటే ఇండస్ట్రీలో ఒక సంవత్సరం సీనియర్‌వి. నువ్వు 2002లో హీరో అయితే, నేను 2003లో నిర్మాతగా మారా. నీకు నాకూ అనుభవం వచ్చింది. నాకు ఎలాగైతే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వచ్చిందో నీకూ అలాగే వచ్చింది. నీకంటే జూనియర్‌ని అయినా, కెరీర్‌లో ఒక్కోటి సాధించుకుంటూ ఒక టాప్‌లోకి వచ్చా. నితిన్‌ను కూడా అలాగే ఊహించుకున్నా. ఎందుకంటే ‘దిల్‌’ తీసేటప్పుడు నువ్వు.. ‘ఆర్య’ చేసేటప్పుడు అల్లు అర్జున్‌లు ఫ్యూచర్‌స్టార్స్‌గా కనిపించారు. కానీ, నువ్వు మాత్రం ఆ మార్కును సాధించలేకపోయావు’’ అని నిర్మొహమాటంగా చెప్పేశారు.

ఆ వెంటనే నితిన్‌ అందుకుంటూ.. ‘తమ్ముడి’తో పూర్వ వైభవం వస్తుందా?అని అడగ్గా, ‘ఈ సినిమాతో సక్సెస్‌ఫుల్ హీరో అవుతావు. ఇది సరిపోదు. కొడితే ‘ఎల్లమ్మ’తో కొట్టాలి’ అని దిల్‌రాజు సమాధానం ఇచ్చారు. ‘బలగం’తో దర్శకుడిగా మారిన హాస్యనటుడు వేణు దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ రానుంది. ఈ మూవీని కూడా దిల్‌ రాజే నిర్మిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -