– నత్తనడకన నిర్మాణాలు
– నాసిరకం రకం పనులు
– దుమ్ము ధూళి తో శ్వాసకోశ వ్యాధులు
– ఇక్కట్లకు గురౌతున్న పుర ప్రజలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలో గత మూడేండ్లు గా సెంట్రల్ లైటింగ్,రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. 2023 లో నాటి ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు ప్రారంభించిన ఈ పనులు నిధులు లేమితో ఈ పనులు నత్తనడక ను తలపిస్తున్నాయి. అశ్వారావుపేట లోని మూడు రోడ్ల ప్రధాన కూడలి నుండి బూర్గంపాడు రోడ్, సత్తుపల్లి రోడ్, జంగారెడ్డిగూడెం రోడ్,మున్సిపాల్టీ కార్యాలయం రోడ్ ల్లో సెంట్రల్ లైటింగ్, రోడ్ విస్తరణ పనులు నిర్వహిస్తున్నారు.
ఈ నాలుగు వైపుల సైతం వాహనాలు రద్దీ కారణంగా ఉత్పన్నం అయ్యే దుమ్ము ధూళి తో పుర ప్రజలు నానా ఇక్కట్లకు గురౌతున్నారు. వ్యాపారాలు సైతం అంతంత మాత్రమే సాగడంతో దుకాణాల యజమానులు ఆర్ధిక ఇబ్బందులు గురి అవుతున్నారు. నిర్మాణాలు సైతం నాణ్యతా లేమి తో చేయడంతో చిన్నపాటి వాహనాలు ఢీ కొట్టినా డివైడర్ లు శిధిలం అవుతున్నాయి.ఈ పనులు పైనే కొన్ని నెలలు క్రితం రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్నింగ్ వాక్ నిర్వహించి స్వయానా సమీక్షించారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం అశ్వారావుపేట లోని తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన ప్రతీ సారి అధికారులకు గుర్తు చేస్తూనే ఉన్నారు. ఇక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అశ్వారావుపేట లో పర్యటించిన ప్రతీసారి పనుల్లో జాప్యం వద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ఈ పనులు మాత్రం ఇప్పట్లో పూర్తి అయ్యేలా లేవు.ఎండేస్తే దుమ్ము,ధూళి,వానొస్తే వరద,బురదతో పుర ప్రజలు అవస్తలు అన్నీ కావు.
అశ్వారావుపేట నుండి పాపిడి గూడెం మీదుగా ఆంధ్రప్రదేశ్,జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం రోడ్ గత వర్షాలకు శిధిలం అయిన తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ రోడ్ లో తెలంగాణ పరిధిలో నే గతేడాది ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు విద్యార్ధులతో పల్లి కొట్టింది.ఈ సంఘటనలో విద్యార్ధులు అందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాణాపాయం లేనప్పటికీ తరుచు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.



