- Advertisement -
నవతెలంగాణ – (వేల్పూర్ ) ఆర్మూర్
మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం మంగళవారం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్ రెడ్డి రైతులని ఉద్దేశించి మాట్లాడుతూ.. సకాలంలో పాడి పశువులకు టీకాలు వేయించుకోవాలని రైతులకు తెలిపారు. గాలికుంటు వ్యాధి వచ్చిన పశువులలో పాల దిగుబడి తగ్గుతుందని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం నర్సరెడ్డి , సిబ్బంది సురేష్ ,జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ గంగాధర్ ,లైవ్ స్టాక్ అసిస్టెంట్ దయానంద్, హాస్పిటల్ అసిస్టెంట్ వాజిద్ ,గోపాల్ మిత్ర పాల్గొన్నారు.
- Advertisement -