నవతెలంగాణ – (నందిపేట్ ) ఆర్మూర్
భారత రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాలి కుంట వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నందిపేట మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో బుధవారం నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి డాక్టర్ ఎస్ నితీష్ వర్మ మాట్లాడుతూ.. పీకలు వేయించడం వలన పశువులకు గాలి కట వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చని, పశువుల ఉత్పాదకత పెరుగుతుందని, రైతులకు ఆర్థిక నష్టం సైతం తగ్గుతుందని అన్నారు. నిర్నిత తేదీలలో ఆయా గ్రామాలలో పశు వైద్య సిబ్బంది గ్రామాలకు వస్తారని, తప్పనిసరిగా టీకాలు వేయించాలని కోరినారు. గేదెలకు (285), ఆవులకు (10) దూడలకు కు ఉచితంగా గాలి కుంటి వ్యాధి నివారణ టీకాలు వేసినారు. .ఈ కార్యక్రమం లో పశు వైద్య సిబ్బంది ఎల్. ఎస్. ఏ. మారుతి, ఓ. ఎస్. లు అబ్దుల్ వజీద్, సజ్జద్, మంజు, గోపాలమిత్ర శశి , రైతులు తదితరులు పాల్గొన్నారు.
సిద్దాపూర్ లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES