భద్రతా మండలి అధ్యక్ష పదవిని పాక్ చేపట్టడంపై కాంగ్రెస్ విమర్శ
న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితిలో కీలక పదవి చేపట్టకుండా పాకిస్తాన్‌ను నివారించడంలో ప్రధాని మోడీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ బుధవారం విమర్శించింది. ”భారత్‌కు ఇది ప్రధానమైన దౌత్యపరమైన ఎదురు దెబ్బ” అని వ్యాఖ్యానించింది. జులై మాసానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను చేపడుతున్నట్లు పాకిస్తాన్ మంగళవారం వెల్లడించింది. ఐక్యరాజ్య సమితికి అధికార కేంద్రంగా భద్రతా మండలి పనిచేస్తుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా పాకిస్తాన్‌కు రెండేళ్ళ పదవీకాలం ఈ ఏడాది జనవరి నుండి ప్రారంభమైంది. అందులో భాగంగానే ఈ అధ్యక్ష పదవి కూడా చేపడుతోంది. దీనికి తోడు తాలిబన్ ఆంక్షల కమిటీకి కూడా పాకిస్తాన్ అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి తీవ్రవాద వ్యతిరేక కమిటీ ఉపాధ్యక్షురాలిగా కూడా చేయనుంది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జివాలా ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ, తీవ్రవాద దేశమైన పాక్ ఇప్పుడు అంతర్జాతీయ సెక్యూరిటీ బ్రోకర్‌గా మారిందని విమర్శించారు. ‘దెయ్యం ఇప్పుడు కుర్చలో కూర్చుంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తీవ్రవాద దేశంగా రుజువైన, ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న, వారిని పెంచి పోషిస్తున్న, భారత్‌కు తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ నాయకత్వ పదవులకు ఎగబాకింది. ఒకపక్క ఆ దేశం పాల్పడుతున్న ఉగ్రవాదాన్ని భారత్ అనుభవిస్తుండగానే ఇది చోటు చేసుకుందని సూర్జివాలా విమర్శించారు. పహల్గాం దాడి జరిగిన కొద్ది వారాలకే ఇలా జరగడం పట్ల మౌడీ ప్రభుత్వం మౌనంగా, నిష్క్రియాపరత్వంగా వుండడాన్ని ప్రశ్నించారు. పైగా ఐక్యరాజ్య సమితి తీవ్రవాద నిరోధక కమిటీ ఉపాధ్యక్షురాలిగా గతనెల 4న పాక్ బాధ్యతలు చేపట్టడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ తీర్మానాలను పదే పదే ఉల్లంఘించినా ఈ పదవులు వరించడాన్ని ఆయన ప్రశ్నించారు.
దౌత్యపరంగా భారత్‌కు ఎదురుదెబ్బ !
- Advertisement -
- Advertisement -