సంక్రాంతి పండగని పురస్కరించుకుని అల్లుఅర్జున్ తన అభిమానులను ఓ సరికొత్త అప్‌డేట్‌తో సర్‌ప్రైజ్ చేశారు. ఆయన హీరోగా నటించబోయే తన 23వ చిత్రాన్ని లొకేష్‌కనకరాజ్ దర్శకత్వంలో చేయబోతున్నారు.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. భారతీయ సినీ పరిశ్రమలో ఇద్దరు స్టార్స్ కలిసి పని చేయబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించ నుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని బివి వర్క్స్త్‌తో కలిసి గ్రాండ్‌గా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రారంభం కానుంది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలుగా, బన్నీవాస్‌తో పాటు నట్టి, శాండీ, స్వాతి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో..
- Advertisement -
- Advertisement -



