Sunday, January 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలువి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో..

వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో..

- Advertisement -

వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్‌ తన 36 సినిమాకు గ్రీన్‌ సిగ్న‌ల్‌ ఇచ్చారు. వి.ఐ.ఆనంద్‌ దీనికి దర్శకత్వం వహించనున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రథ సప్తమి సందర్భంగా ఈ సైఫై ఎంటర్‌టైనర్‌ను మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. విభిన్నమైన కథలు, కథనాలతో సినిమాలను రూపొందించే దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ మరోసారి ఈ భారీ ప్రాజెక్ట్‌తో క్రియేటివ్‌ బౌండరీస్‌ రేంజ్‌ను మరింత పెంచటానికి సిద్ధమయ్యారు. సినీ ప్రేక్షకులకు ఇప్పటి వరకు చూడని సరికొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా ఈ క్రేజీ సినిమా రూపొందనుంది. ‘ఊరు పేరు భైరవకోన’ తర్వాత ఈ విజనరీ డైరెక్టర్‌ హై కాన్సెప్ట్‌ సైఫై ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను మెప్పించనున్నారు.
నితిన్‌ హీరోగా నటిస్తుండటంతో ఈ మూవీపై ఎగ్జైట్‌మెంట్‌ మరింతగా పెరిగింది.

వెర్సటైల్‌, పవర్‌ఫుల్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే నితిన్‌ వంటి కథానాయకుడితో..క్వాలిటీ సినిమాలను గ్రాండ్‌ స్కేల్‌లో సినిమాను రూపొందించే శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ సంస్థ చేతులు కలపటం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రెస్టీజియస్‌ కాంబోను చూస్తుంటే సినిమాపై నిర్మాత శ్రీనివాస చిట్టూరికి ఉన్న ప్యాషన్‌ కనిపిస్తోంది. ఆదివారం రథ సప్తమి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్‌ చేశారు. త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. టాలెంటెడ్‌ హీరో, వైవిధ్యంగా సినిమాను తెరకెక్కించే దర్శకుడు, గ్రాండ్‌గా సినిమాను నిర్మించే సంస్థ కలయికలో రూపొందబోయే ఈ సైఫై ఎంటర్‌టైనర్‌ నితిన్‌ కెరీర్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా మారనుంది. నితిన్‌ 36వ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్‌ ప్రకటించనున్నారు. ఈచిత్రానికి రచన- దర్శకత్వం: వి.ఐ.ఆనంద్‌, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి సమర్పణ: పవన్‌ కుమార్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -