ఎన్పిఆర్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: వికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో శరీరక వికలాంగుల రోస్టర్ 10లోపు మార్చాలని, వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మే 13న వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య తెలిపారు. సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయం ముందు మే 13న జరిగే డైరెక్టర్ కార్యాలయం ముట్టడి కరపత్రాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 43.02 లక్షల మంది వికలాంగులున్నారు. 2014 లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 10.48 లక్షల మంది ఉంటే 4,90,044 మందికే పెన్షన్స్ వస్తున్నావి. 2016 ఆర్పిడబ్ల్యుడి చట్టం, 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. మహిళా వికలాంగులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, వికలాంగులపై దాడులు, వేధింపులు పెరిగిపోతున్నవి. వైకాల్యం కలిగిన విద్యార్థుల కోసం ప్రత్యేక విద్య సంస్థలు లేకపోవడం వలన ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న టీసీపీసీ కేంద్రాలను బలోపేతం చేస్తూ, ఉమ్మడి జిల్లాలో టీసీపీసీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు ప్రమోషన్స్ లలో రిజర్వేషన్స్ అమలు కావడం లేదు.వికలాంగుల వివాహ ప్రోత్సాహం 2 లక్షలకు పెంచడంతో పాటు జంటలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం,ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకుంటే 5 లక్షల ప్రోత్సాహం, ఇవ్వాలని డిమాండ్ చేశారు. 40శాతం వైకాల్యం ఉన్న ప్రతి ఒక్కరికి పరికరాలు ఇవ్వడంతో పాటు చదువుతో నిమిత్తం లేకుండా వైకల్య తీవ్రతను బట్టి మోటారైస్డ్ వాహనాలు ఇవ్వాలి. ఆర్టీసీ లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి, 2016 ఆర్ పి డి చట్టం, 2017మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అమలులో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రతి మండల కేంద్రంలో భవిత సెంటర్స్ ఏర్పాటు చేసి, మండల సమాఖ్యల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్.హెచ్.సి కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. తీవ్ర వైకాల్యం కలిగిన వికలాంగులకు 25,000 ప్రత్యేక అలావెన్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయాలి.ప్రతి వికలాంగునికి సామజిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ, ప్రయివేట్ విద్య సంస్థల్లో స్పెషల్ టీచర్స్ నియమించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం ఉంది. వికలాంగుల సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.సమస్యల పరిష్కారం కోసం మే 13న డైరెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని ఆయన హేచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి స్వామి, జిల్లా అధ్యక్షులు సూరపంగా ప్రకాష్,జిల్లా కార్యదర్శి వి ఉపేందర్, జిల్లా కోశాధికారి కె లలిత,జిల్లా నాయకులు శ్రీహరి, శ్రీనివాస్, నర్సింహా లు పాల్గొన్నారు.
డైరెక్టర్ కార్యాలయం ముట్టడి కరపత్రం ఆవిష్కరణ.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES