Tuesday, July 8, 2025
E-PAPER
Homeసినిమాకుటుంబ నేపథ్యంలో 'దీర్ఘాయుష్మాన్‌ భవ'

కుటుంబ నేపథ్యంలో ‘దీర్ఘాయుష్మాన్‌ భవ’

- Advertisement -

కార్తీక్‌రాజు, నోయల్‌, మిస్తి చక్రవర్తి హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘దీర్ఘాయుష్మాన్‌ భవ’. ఎం.పూర్ణానంద్‌ దర్శకత్వంలో త్రిపుర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత వంకాయల పాటి మురళీకష్ణ నిర్మించారు.
సోమవారం ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకలో ట్రైలర్‌ను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌, ఫిలిం ఛాంబర్‌ సెక్రటరీ కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌, ప్రోమోస్‌ను నటుడు ఓ.కల్యాణ్‌, పాటలను జబర్దస్త్‌ ఆర్‌.పి.ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని నట్టీస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ తరపున థియేటర్లలో విడుదల చేస్తున్న నట్టి కుమార్‌ మాట్లాడుతూ,’చిన్న సినిమాల సమస్యలను తీర్చేందుకు ఇటు పరిశ్రమ, అటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. చిన్న సినిమాకు 2-30 గంటల షోను కేటాయించాలి. మల్టీఫ్లెక్స్‌లలో పేదవాడు సినిమా చూసే విధంగా ఆక్యుపెన్సీలో 20 శాతం టిక్కెట్‌ రేట్లను 75 రూపాయలుగా నిర్ణయించాలి. ఫ్యామిలీ అంతా కూర్చుని హాయిగా చూసేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు. ‘ఈ నెల 11న థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అన్ని ఎమోషన్స్‌ ఉన్న చక్కటి చిత్రమిది’ అని వంకాయలపాటి మురళీకష్ణ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -