- Advertisement -
నవతెలంగాణ మునుగోడు:
వార్డుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మురికి కాల్వలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ అన్నారు. సోమవారం ఒకటో వార్డులో ఉన్న మురికి కాల్వలను చెత్తను గ్రామపంచాయతీ కార్మికులతో శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి వార్డు సభ్యులు పందుల నీతా రాజేష్ , పందుల ప్రియాంక లింగస్వామి , పందుల స్వామి తదితరులు ఉన్నారు.
- Advertisement -



