- Advertisement -
- – స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేయాలి
– వికలాంగుల కార్పొరేషన్ను బలోపేతం చేయాలి
– ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట్ గ్రామంలో ఎన్ పి ఆర్ డి గ్రామ కమిటీ సమావేశం గురువారం పోస్కూరి సైదులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. వికలాంగుల పెన్షన్ 6000 లకు పెంచి, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో వికలాంగులకు నామినేటెడ్ పదవులు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టాలు చేసి అమలు చేయాలని తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 లకు సవరణలు చేసి ప్రతి స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేటెడ్ చేయడానికి అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చట్టం చేయడం వలన రాష్ట్రంలో 26,568 మంది వికలాంగులకు నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి18 నెలలు పూర్తి అవుతున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయడం లేదన్నారు. తక్షణమే పెన్షన్ పెంచి, 2024 డిసెంబర్ నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. - ఈ క్రమంలో వికలాంగుల కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం వికలాంగులకు అందిస్తున్న అన్ని రకాల సహాయ పరికరాలు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వంకు కార్పొరేషన్ ను బలోపేతం చేయాలనే అలోచన లేకపోవడం వలన కార్పొరేషన్ నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడం, అవసరం అయిన నిధులు కేటాయించడం వలన కార్పొరేషన్ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని చేపారు. అన్ని ఉద్యోగాల్లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్స్ అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. 2016 RPD చట్టం, నేషనల్ పాలసీ, నేషనల్ ట్రస్ట్ చట్టాలను పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాల్లో వికలాంగులకు 5 శాతం కేటాయించడంతో పాటు 25 శాతం అదనంగా ఇవ్వాలనే నిబంధనను కచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి తూప్రాంపేట్ గ్రామ అధ్యక్షులు పోస్కూరి సైదులు, ఉపాధ్యక్షులు పగడాల సాయికిరణ్, కార్యదర్శి భారతరాజు శివ, సహాయ కార్యదర్శి పి వెంకట్రావు, కోశాధికారి ఆకుల ప్రవీణ్, బి పోశయ్య, ఆకుల రాములు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -